ఔనంటే కాదనీ లే...కాదంటే ఔననీ లే...

 హైదరాబాద్: రాజకీయంలో సుదర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కూడా ఎప్పుడేమీ మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తమ మాటలతో ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్నారు. మంత్రి హెదాలో ఉన్న వ్యక్తులు కూడా తమకు తోచిన విధంగా మాట్లాడుతున్నారు.ఇందుకు తాజా ఉదాహరణనే...రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి. ‘నేను వైఎస్ఆర్ పార్టీలో చేరబోతున్నట్లు దుష్ర్పచారం జరుగుతోంది. ఒక వేళ భవిష్యత్ లో నేను జగన్ పార్టీలో చేరినట్లయితే నన్ను సమాజం నుండి వెలివేయండి’ అంటూ మాట్లాడిన తీరు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్ పార్టీలోకి రఘువీరారెడ్డిని రావల్సిందిగా ఎవరైనా ఆహ్వానించారా? ఒకవేళ ఆహ్వానిస్తే ఫలాన వారు నన్ను రమ్మని ఇబ్బంది పెడుతున్నారనీ చెప్పాల్సిన బాద్యత రఘువీరా పైనా వుంది.  వైఎస్ఆర్ పార్టీలో చేరితే సమాజం నుంచి వెలివేయండంటూ రఘువీరా చేసిన వ్యాఖ్యలు కూడా సమంజసంగా లేవు. వైఎస్ఆర్ పార్టీ ఏమైనా నిషేధిత పార్టీయా? ఆ పార్టీని ప్రభుత్వ రద్దు చేసిందా? ప్రజలు తిరస్కరించారా? లేక నిషేధించారా? ఆ పార్టీలోకి వెళ్లితే వెలేయండంటూ మంత్రి హెదాలో ఉన్న రఘువీరారెడ్డికి అలా మాట్లాడటం ఎంత మాత్రం తగదనీ ప్రజాస్వామ్యవాదులంటున్నారు. నిన్న గాక మొన్న గాంధీభవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డి ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో దివంగత వైఎస్ఆర్ ఫోటో లేదంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఉద్వేగభరితంగా మాట్లాడటం...అక్కడే ఉన్న రఘువీరారెడ్డి కంటతటి పెట్టిన విషయం విధితమే. దీనిపై పార్టీలో కొంత దుమారం కూడా రేగింది. పార్టీలోనే కాదు, రాష్ర్ట మంత్రి వర్గంలోనూ కోవర్టులున్నారంటూ యూత్ కాంగ్రెస్ మాజీ నేత సుధాకర్ బాబు పీసీసీ చీఫ్కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి జగన్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రఘువీరారెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి మంచి ఫాలోవర్. వైఎస్ఆర్ ఆశీస్సులతోనే రఘువీరా ఇంతగా ఎదిగారనీ యావత్ రాష్ర్టానికి తెలుసు. వైఎస్ మరణం తరువాత ఆయన కుమారుడు, ప్రస్తుత వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ను సీఎం చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తుల్లో రఘువీరా ముందు వరుసలోనే ఉన్నాడు. అలాంటి రఘువీరా...ఇప్పుడు జగన్ పార్టీలోకి వెళ్లితే వెలేయండని సమంజసంగా లేదనీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ర్టంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన పార్టీగా, నేతగా జగన్కు వుంది. అలాంటి పార్టీలోకి వెళ్లితే వెలేయండనడంలోనే రఘువీరా అసలు రాజకీయం దాగి వుందనీ పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. దీనికి నిదర్శనమే దివంగత పీజేఆర్ కూతురు విజయారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం.అంతేకాదు, రాజకీయ నాయకులు ఔనంటే కాదనీ, కాదంటే ఔననీ రాష్ర్ట ప్రజలు ఏనాడో తెలుసుకున్నారు. సో...జగన్ పార్టీలోకి వెళ్లితే వెలేయండంటున్న రఘువీరానే అనంతపురం జిల్లాలో అందరికంటే ముందుగా వెళ్లినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదు. దటీజ్ రాజ‘కీ’యం. ప్రజలూ బీ అలర్ట్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: